విశాఖ నగరంలోని వీఎంఆర్డీఏ థియేటర్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను మైనార్టీ సమాఖ్య ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడారు. ముస్లిం మైనార్టీలు... ఎస్సీ, ఎస్టీల కంటే అట్టడుగు స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. మైనార్టీల స్థితిని గుర్తించిన వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు.
అందుకే ముస్లిం కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలిగారని చెప్పారు. వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నేతృత్వంలో... ముస్లిం, మైనార్టీ సోదరులకు సబ్‌ప్లాన్ ద్వారా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. దుల్హన్ పథకంలో ప్రస్తుతం ఇస్తున్న రూ.50వేలను రూ.లక్షకు పెంచినట్టు చెప్పారు.
హజ్, జేరూసలేం యాత్రలు చేసే వారికీ సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు రూ.20 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అల్ప సంఖ్యాక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ... 10 డివిజన్లలో అవకాశం ఇవ్వాలని విశాఖ నగర పార్టీని అంజాద్ బాషా కోరారు.
ఇదీ చదవండి