విశాఖలో పోర్టుల కన్సార్టియం నిర్వహణలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.... ఓ ప్రధాన వాణిజ్య సముదాయాన్ని అమ్మకానికి పెట్టింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.... లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత భారీస్థాయిలో స్థిరాస్తిని అమ్మకానికి ఉంచింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని హెచ్.బి కాలనీలో మద్దిలపాలెం వార్డులో ఉన్న వాణిజ్య స్థలం విక్రయానికి ఎమ్‌ఎస్‌టీసీ ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. ఈనెల 24 వరకు ఆ స్థిరాస్తిని పరిశీలించుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనే వారికి అవకాశం కల్పించింది. ఈనెల 30న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్‌ఎస్‌టీసీ ఆక్షన్ నిర్వహిస్తుంది.
ఒకే లాట్‌గా సముదాయం
మొత్తం 4,455 చదరపు మీటర్ల భవన స్థలం, రెండు బేస్మెంట్లు, ఐదు అంతస్తుల వాణిజ్య సముదాయం 90శాతానికిపైగా నిర్మాణం పూర్తి చేసుకుంది. తీవ్రమైన ఆర్థిక అవసరాల దృష్ట్యా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ భవన సమదాయం అమ్మకం ద్వారా కొంత సొమ్మును సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. ఒకే లాట్‌గా ఈ సముదాయాన్ని అమ్మకానికి పెట్టింది. బిడ్‌లో పాల్గొనే వారు రెండు కోట్ల రూపాయలు ఈఎండీగా చెల్లించాలని నిబంధనల్లో వివరించింది.1987లో వుడా నుంచి ఈ స్థలాన్ని డీసీఐ కొనుగోలు చేసింది. ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టింది.
ఇదీ చదవండి:గంటల వ్యవధిలోనే... కేంద్రానికి మండలి రద్దు తీర్మానం