Daughters conduct funerals to father: కని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు కుమార్తెలు. కుమారులు లేకపోవటంతో తండ్రి మృతదేహానికి వారే దగ్గరుండి దహన సంస్కారాలు(daughters conducted the funeral) చేశారు. విశాఖలోని ఎంవీపీకాలనీ సెక్టారు-2లో నివాసముంటున్న గణపతిరావుకు ఇద్దరూ ఆడపిల్లలే. వీరిలో రీతూపర్ణ వివాహిత. ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమార్తె ఉపాసన అవివాహిత. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న గణపతిరావు మంగళవారం మృతి చెందారు. దీంతో ఇద్దరు కుమార్తెలు దగ్గరుండి బుధవారం అన్ని కార్యక్రమాలను చేపట్టారు.
తండ్రి శవయాత్రలో పాల్గొని పాడెను సైతం మోశారు. తర్వాత శ్మశానవాటికలో వారి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దహన సంస్కారాల్లో పాల్గొని తండ్రి చితికి నిప్పంటించారు.
ఇదీ చదవండి