విశాఖ నగర నడిబొడ్డున 45 చదరపు కిలోమీటర్ల మేర 400 కోట్ల రూపాయలతో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో 24 గంటలు తాగునీటి సరఫరా చేసేందుకు పనులు చేపడుతున్నారు. 2018లో మొదలైన ఈ పనులు ప్రస్తుతం 60 శాతం పూర్తయ్యాయి. కుళాయి నీటికి విరామమనేదే లేకుండా..ఇంటింటా శుద్ధినీటిని ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దశలవారీ 2వేల ఇళ్లకు పూర్తిస్థాయిలో కనెక్షన్లు ఇచ్చారు.
పాత పైపులైన్ల వ్యవస్థలో 40 శాతం నీరు వృథా అయ్యేది. కొత్తపైపులైను వ్యవస్థను వేయడంతోపాటు..సరఫరా నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సగటున 1.11 శాతం మాత్రమే నీటినష్టం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవస్థను మాధవధార వుడాకాలనీ ఫేజ్-1, మర్రిపాలెం వుడాకాలనీ, కరాస, శివానగర్, ఎఫ్సీఐ కాలనీ, రాణాప్రతాప్‌నగర్ ప్రాంతాలకు అనుసంధానించి పరిశీలనలు చేస్తున్నారు. మరో నెలరోజుల్లో ఇంకో 2 వేల ఇళ్లకు అదనంగా అనుసంధానించనున్నారు. పైపులైను వ్యవస్థ ఉన్నచోటల్లా అడ్వాన్స్డ్ మీటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థను తెచ్చారు. దీంతో నీటిసరఫరా ఎలా ఉంటోంది, ఎక్కడ లోపాలున్నాయనేది ప్రతీ గంటకీ స్కాడా కంట్రోల్‌రూమ్‌కి సంకేతాలు అందిలా సాంకేతికత ఏర్పాటు చేశారు.
స్కాడా వ్యవస్థ పర్యవేక్షణతో మంచి ఫలితాలొస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. తమకు నీళ్ల కష్టాలు తొలగిపోయాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి
Chandrababu: 'దాడులకు భయపడం.. మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'