'3 కోట్లు కేటాయించి.. పండుగ చేసుకోమంటారా..?' - vizag latest news
విశాఖ రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం ఎదుట ప్లకార్డులు పట్టుకుని సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు... కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కేవలం 3 కోట్ల రూపాయలను ప్రకటించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేశారు.