ETV Bharat / city

కరోనా రెండో 'అల'జడి...అప్రమత్తతతో వైరస్​కి చెక్​ ! - ఏపీలో కరోనా రెండో దశ

విశాఖ నగరం గత 7 నెలలుగా కొవిడ్‌ బాధల్ని నగరం భరిస్తుంది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గి కాస్త ఊరట చెందుతోందనే సమయంలో.. మరోసారి కొవిడ్‌ విజృంభించొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా... ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారిలో యాండీబాడీస్‌ తయారైనా..అవి 3 నెలలకు మించి ఉండటంలేదని పరిశోధనలు చెబుతున్నాయి. రానున్న నెలల్లో అప్రమత్తతే ఈ వైరస్​కి చెక్ పెట్టేలా చేస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Covid second wave
Covid second wave
author img

By

Published : Nov 1, 2020, 8:02 AM IST

కరోనా రెండో 'అల'జడి...అప్రమత్తతతో వైరస్​కి చెక్​ !

విశాఖ నగరంలో జూన్‌ వరకు కరోనా కేసుల తీవ్రత అంతగాలేకున్నా.. జులై నుంచి భారీగా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఆగస్టులో పతాక స్థాయికి చేరుకున్నాయి. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత రెండు నెలల్లో డిశ్చార్జీల సంఖ్య భారీగా పెరిగాయి. బాధితుల్లో 95 శాతం పైగా రికవరీ ఉంది. తాజా పరిస్థితుల కరోనా మళ్లీ తిరిగబెట్టొచ్చని వైద్యవర్గాలు అంచనావేస్తున్నాయి. అన్‌లాక్‌ సడలింపులతో..సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, సినిమాహాళ్లు.. ఇలా పూర్వవైభవం వస్తోంది. మరోవైపు వేడుకలు సర్వసాధారణంగా నిర్వహించుకుంటున్నారు. ఇవన్నీ కొవిడ్‌ తీవ్రత మళ్లీ పెంచేవి కానున్నాయి.

కరోనా రెండో విడత ప్రభావం మొదలైందని వైద్యనిపుణులు భావిస్తున్నారు. నవంబరు, డిసెంబరులో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. తాజా కేసుల్ని చూస్తోంటే కొవిడ్‌ వైరస్‌ స్ట్రేయిన్స్‌ (జాతులు)లో మార్పులొచ్చినట్లుగా వైద్యనిపుణులంటున్నారు. కొత్త వైరస్‌ కాబట్టి ఏ జాతి ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనావేయలేమంటున్నారు. ప్రస్తుతానికి ఒకసారి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చాక రెండోసారి వైరస్‌ వచ్చినవారి సంఖ్య అధికారికంగా చాలా తక్కువ. సెప్టెంబరు నుంచి కొవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. దీనిక్కారణం వైరస్‌ తన ఉనికిని కోల్పోయిందని చెప్పడంకన్నా, ఇప్పటికే చాలామందిలో వైరస్‌ వచ్చిందని చెప్పడమే సబబని వైద్యులంటున్నారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు బయట తిరిగినట్లు దాఖలాలున్నాయని, వారిని కలిసినవారిలో అతి తక్కువ మందిలోనే లక్షణాలు కనిపించాయని వెల్లడిస్తున్నారు. రెండో విడత వైరస్‌ విజృంభణపై జిల్లా యంత్రాంగంలోనూ అనుమానాలున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో నవంబరు 2, 3 తేదీల్లో సీరో సర్వైలెన్స్‌ని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్‌ జోన్లు, ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా పరీక్షలు చేయనున్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో బయట తిరిగే వ్యక్తుల్లోనే చాలా మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆ సర్వేలో.. 20.7 శాతం జనాభాలో కొవిడ్‌ వైరస్‌ యాంటీ బాడీలున్నాయని గుర్తించారు. నమూనాగా చేస్తేనే ఈ తీవ్రత వచ్చిందని, అందరికీ చేస్తే సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులన్నారు. అన్ని వార్డుల్లోనూ కరోనా అవగాహన ప్రచారాలు మళ్లీ ప్రారంభించారు. ర్యాలీలు, ప్లకార్డులు ప్రదర్శించడం, ప్రకటనలు ఇస్తున్నారు. అన్ని వార్డు సచివాలయాల్లో సూచనల్ని ప్రదర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో హోర్డింగ్‌లు పెట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా నగరవాసుల్ని అప్రమత్తం చేస్తున్నారు.

నాలుగు జిల్లాల రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న విమ్స్‌లో కేసులు పూర్తిగా తగ్గాయి. ఉన్న నలుగురైదుగురూ త్వరలో డిశ్చార్జి అవనున్నారు. ఈనేపథ్యంలో ఆసుపత్రిని నాన్‌ కొవిడ్‌గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. అయితే రెండోవిడత వైరస్‌ విజృంభిస్తుందనే అంచనాలున్న కారణంగా కొవిడ్‌ ఆసుపత్రిగానే కొనసాగించాలనే నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : విశాఖలో దారుణం...ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.