విశాఖ కేజీహెచ్‌లో ఉదయం భవనం పై నుంచి కింద పడిన కొవిడ్ రోగి మృతి చెందాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కేజీహెచ్‌లోని సీఎస్‌ఆర్ బ్లాక్ నుంచి వెంకట్రావు అనే రోగి కింద పడి తీవ్రగాయాలవగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రెండ్రోజులుగా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కేజీహెచ్‌లోని ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం