విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతోంది. రోజుకు ఇద్దరు చొప్పున వైరస్ బాధితులు మృత్యువాత పడుతున్నారు. ఆసుపత్రిలో మృతిచెందిన వారిని వెంటనే అక్కడి నుంచి తరలించడం లేదు. ఇది చూసి మిగిలిన రోగులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణభయంతో గుండె ఆగి కొందరు మరణించారు. తమకు ప్రాణసంకటంగా ఉంటుందని.. మృతదేహాలను తక్షణమే కోవిడ్ వార్డు నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని మిగిలిన రోగులు కోరుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున మృతి చెందాడు. అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించలేదు. సాయంత్రం వరకూ కరోనా బాధితుల మధ్యనే మృతదేహం మంచంపైనే ఉండిపోయింది. ఇలాగే ప్రతిరోజూ వార్డులో మృతదేహాల మధ్యనే ఉండాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఎప్పటికప్పుడు మృతదేహాలను శవాగారానికి తరలించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: