విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం, వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి ల్యాబ్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖ విమ్స్‌లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్థానిక అంటువ్యాధుల ఆసుపత్రిలో అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. కేజీహెచ్‌లో ప్రత్యేకంగా కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన వారికి చికిత్స అందించే వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనుమానితుల రక్త నమూనాలు విజయవాడ ల్యాబ్‌కు పంపి వారికి చికిత్స అందిస్తున్నారు. మరింత అధునాతన వైద్య సహాయ పరికరాలు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. రెండు వారాల సమయంలో మరిన్ని ల్యాబ్‌లను రాష్ట్రంలో వివిధ నగరంలో నెలకొల్పడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు రంగం సిద్ధం
విశాఖలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నివారణకు మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయటానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖ విమ్స్‌లో క్వారంటైన్ సెంటర్‌తో పాటు వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
విశాఖలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం, వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి ల్యాబ్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖ విమ్స్‌లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. స్థానిక అంటువ్యాధుల ఆసుపత్రిలో అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. కేజీహెచ్‌లో ప్రత్యేకంగా కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన వారికి చికిత్స అందించే వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనుమానితుల రక్త నమూనాలు విజయవాడ ల్యాబ్‌కు పంపి వారికి చికిత్స అందిస్తున్నారు. మరింత అధునాతన వైద్య సహాయ పరికరాలు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. రెండు వారాల సమయంలో మరిన్ని ల్యాబ్‌లను రాష్ట్రంలో వివిధ నగరంలో నెలకొల్పడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాపై యుద్ధం...కట్టడికి పూర్తి స్థాయిలో సర్కార్ సన్నద్ధం