విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి బాలయోగి బాలురు గురుకుల పాఠశాల ఆవరణలో చెట్లకు కరోనా పువ్వులు పూశాయి. కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలను నాటారు. వాటిలో విద్యార్థుల భోజనశాల సమీపంలోని చెట్లకు పెద్ద ఎత్తున కరోనా వైరస్ నమూనా ఆకారంలో పుష్పాలు పూశాయి. ఆకర్షణీయంగా ఉన్న వీటిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ చూడండి..