ETV Bharat / city

Delta variant : విశాఖలో కలకలం... 51ఏళ్ల మహిళకు డెల్టా వైరస్ - విశాఖలో కరోనా కేసులు

విశాఖలో(vizag) కరోనా డెల్టా వేరియంట్(corona delta variant) కేసు నమోదవడం కలకలం రేపింది. వాంబే కాలనీకి చెందిన ఓ మహిళలో ఈ వైరస్(virus)​ను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

corona delta variant case founded in vizag
విశాఖలో కలకలం... 51ఏళ్ల మహిళకు డెల్టా వైరస్
author img

By

Published : Jul 1, 2021, 4:48 PM IST

విశాఖ శివారు వాంబే కాలనీలో కరోనా డెల్టా వేరియంట్ (corona delta variant) కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. వాంబే కాలనీకి చెందిన 51ఏళ్ల మహిళలో డెల్టా రకం వైరస్​ను(virus) గుర్తించినట్లు డీఎంహెచ్​వో సత్యనారాయణ తెలిపారు. గతేడాదే కరోనా బారిన పడిన సదరు మహిళ హోమ్ ఐసోలేషన్‌లో ఉండికోలుకున్నారు. ఇప్పుడు కరోనా అనుమానంతో మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా వైద్యులు పరీక్షించి పాజిటివ్‌గా తేల్చారు. ఆమె నమూనాలను హైదరాబాద్ పంపారు. ఆమెకు డెల్టా రకం వైరస్‌ సోకిందని నివేదిక వచ్చిందని గుర్తించారు. అప్రమత్తం అయిన జీవీఎంసీ అధికారులు బాధితురాలి నివాస పరిసరాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

ఇదీచదవండి.

TTD: భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేట్​ ఏజెన్సీకి అప్పగించిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.