విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 37 కేసులు నమోదుకాగా... 21 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 16 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది మర్రిపాలెం, దండుబజార్, చందక వీధి ప్రాంత వాసులే. నగర ప్రాంతంలో కేసులు పెరగడం.. అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు కొత్త కేసులు వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు.
జీవీఎంసీ సిబ్బంది రసాయనం పిచికారి చేస్తున్నారు. జిల్లా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో విశాఖలో 21 కమిటీలు పనిచేస్తున్నాయి. వైద్య శాఖ సమన్వయంతో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు విశాఖలో స్వల్ప ఆంక్షల సడలింపుతో రహదారులపై రద్దీ కనిపిస్తోంది. రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిగా విమ్స్, జిల్లా కోవిడ్ ఆస్పత్రిగా చాతి, అంటువ్యాధుల ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు