విశాఖలోని కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ధర్నా చేపట్టారు. కరోనా సమయంలో వైద్య సేవలందించిన తమకు వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఏ వన్ ఫెసిలిటీ అండ్ ప్రాపర్టీస్ మేనేజర్స్ తరఫున కేజీహెచ్‌లోని సీఎస్ఆర్ బ్లాక్ కోసం.. 150 మందిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుందని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు గుర్తు చేశారు. నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో.. వీరి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలను చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కృష్ణవేణి, వై రమేష్ బాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: