విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. స్టీల్‌ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితోపాటు వైకాపా ఎంపీలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డితోపాటు పలవురు నేతలు పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అఖిలపక్షాలు నినదించాయి.
దక్షిణ భారత రాష్ట్రాలను భాజపా పట్టించుకోవట్లేదు...
స్టీల్ ప్లాంట్ 100 శాతం అమ్ముతారంటే నిద్ర పట్టలేదు. దక్షిణ భారత రాష్ట్రాలను భాజపా పట్టించుకోవట్లేదు. పోలవరం, రైల్వే జోన్ విషయంలో మొండి చేయి చూపించారు. భాజపా, జనసేన అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. భాజపా, జనసేనలు కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం వెనక్కి తీసుకొనేలా చేయాలి. రాజకీయ జెండాలు పక్కనపెట్టి ప్రజా అజెండాతో ముందుకెళ్లాలి- మంత్రి అవంతి
ఇదీ చదవండి: రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు