శ్రీకాళహస్తి దేవాలయంలో శివలింగం, నంది విగ్రహాలను పెట్టి అపచారం చేసిన ఘటనపై ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన చెందారు ధార్మిక సంస్థల ప్రతినిధి శ్రీనివాసానంద స్వామి. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే సీఎం జగన్ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. హిందూ దేవతా విగ్రహాలను అవమానించే చేష్టలు పెరుగుతున్నాయని... వెంటనే దీనిపై దేవదాయశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి