విశాఖలో తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 26వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గొడవ మొదలైంది. రూ.కోటి 53 లక్షల విలువైన జీవీఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించి... ఇవాళ అక్కయ్యపాలెంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపనకు జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైకాపా కార్పొరేటర్లు హాజరయ్యారు. స్థానిక తెదేపా కార్పొరేటర్ డా.ముక్కా శ్రావణికి, వైకాపా వర్గీయులకు ప్రోటోకాల్‌కు సంబంధించి మాటల యుద్ధం జరిగింది. అది కాస్త తోపులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో తెదేపా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు, కార్పొరేటర్ ముక్క శ్రావణికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక కార్పొరేటర్‌కు ప్రాధాన్యం లేకుండా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ సభ్యులపై... వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గీయులను చెదరగొట్టి శాంతింపజేశారు. ప్రతీ విషయంలో తెదేపా కార్పొరేటర్లకు ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదని.. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని తెదేపా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: