విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న రాధాకృష్ణ సంతానమే.. అవినాష్, దేవకీ నందన. చదరంగంపై అవినాష్‌కి ఉన్న ఆసక్తి అలవాటుగా మారింది. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నాడు. గమనించిన సోదరి దేవకీనందన చెస్ ఆటడం మొదలుపెట్టింది. చిన్నారి ఉత్సాహాన్ని చూసిన తల్లి సరస్వతి... కోచ్ చిరంజీవి వద్ద శిక్షణ ఇప్పించింది. క్రమంగా ఆటపై పట్టు సాధించి పతకాల వేట మొదలుపెట్టిందీ చిచ్చరపిడుగు.
2017లో ఆట ప్రారంభించిన దేవకీనందన 2 నెలలకే జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 7 విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ప్రత్యర్థి ఆట పసిగట్టడంలో దేవకీ నందనకు మంచి పట్టు ఉంది. అటాక్, ఢిఫెన్స్ ఆడడంలో ప్రత్యేకత సాధించింది. 64 గడులపై ఉన్న ఆసక్తే ఆమెను విజేతగా నిలుపుతోంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించి, నిర్విరామంగా సాధన చేస్తోంది. అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలంటే ఖర్చు భారీగా ఉంటుందని ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు తల్లిదండ్రులు.
ఇదీ చూడండి