విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కు తెదేపా మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. బంద్ దృష్ట్యా చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరమైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెదేపా ఎప్పుడూ రాజీపడదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొనాలి: శైలజానాథ్
ఈనెల ఐదో తేదీన జరగనున్న రాష్ట్ర బంద్‌కు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయడం ద్వారా ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం కేంద్రాన్ని తాకేలా చేయాలన్నారు.
ఇదీ చదవండి