విశాఖ ఆర్.ఆర్.వెంటాపురం గ్యాస్ లీక్ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, ఆస్పత్రి పాలుకావటం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన బాధాకరమన్నారు. మనుఘలే కాదు మూగజీవాలు కూడా మృతి చెందాయన్నారు. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శమన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలన్న చంద్రబాబు..సహాయ చర్యలు వేగపరిచి...కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆర్.ఆర్.వెంకటాపురం ఘటన పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి