విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేక ఇనుప ఖనిజాన్ని బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ అన్నారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఇనుప ఖనిజం గనులను ఆర్ఐఎన్ఎల్కు కేటాయించాలని కోరుతూ... ఉక్కు శాఖ తరఫున ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ నిర్మాణం పూర్తయ్యిందని.. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ చేస్తున్న ఉత్పత్తికి తగ్గట్టు రోడ్డు, రైలు మార్గంలో సరకు రవాణా జరుగుతున్నట్లు భాజపా ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ధర్మేంద్ర సమాధానం చెప్పారు.
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా గత అయిదేళ్లలో మూడేళ్లపాటు నష్టాలు మూటగట్టుకోగా.. వైజాగ్ స్టీల్ నాలుగేళ్ల పాటు నష్టాల్లో నడిచిందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ ఐదేళ్ల కాలంలో పన్ను చెల్లింపు తర్వాత సెయిల్‌కు రూ.3,135 కోట్లు, వైజాగ్ స్టీల్‌కు రూ.7,866 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు.
ఇదీచదవండి.