ETV Bharat / city

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ' - విశాఖలో కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు పర్యటన

ఏపీలో భాజపా త్వరలో పట్టు సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు లబ్ది చేకూరుతున్నాయని వివరించారు.

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ'
author img

By

Published : Nov 3, 2019, 6:43 AM IST

భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీగా రాష్ట్రంలో అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్​ ప్రభు జోస్యం చెప్పారు. ప్రజా లబ్ధి చేకూర్చే పథకాలను ఈ రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది 'ఆయుష్మాన్​ భారత్​' పథకంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వారంతా తమ నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్​ భారత్​ను వైఎస్సార్​ ఆరోగ్య శ్రీగా మార్చి ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ముద్ర , ఉజ్వల, కిసాన్​ యోజన లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. విశాఖకు రైల్వే జోన్​ ప్రకటించే సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం కంటే.. ఎక్కువ సహకారం ఆంధ్రప్రదేశ్​కు దక్కుతోందని విశాఖలో సురేష్​ ప్రభు వ్యాఖ్యానించారు.

ap_vsp_10_02_bjp_suresh_prabhu_avb_3182025. రిపోర్టర్: ఆదిత్య పవన్ , కెమెరా : ఏ శ్రీనివాసరావు. ( ) నరేంద్రమోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాదిమంది ఆయుష్మాన్ భారత్ పధకంలో లబ్ది పొందుతున్నారని,చాలా మంది లబ్ది దారులు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ మార్చిందని, కానీ దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ ఆలోచనతో భాగంగా ఈ పధకం నడుస్తోందని అన్నారు.ముద్ర యోజన, ఉజ్వల యోజన, కిసాన్ యోజన లాంటి పధకాలు ప్రజలకు చాలా లబ్ది చేకూరుస్తున్నాయని చెప్పారు బీజేపీ సీనియర్ నేత సురేష్ ప్రభు.త్వరలో ఆంధ్ర ప్రదేశ్లో భాజపా కీలక రాజకీయ పార్టీ గా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.ప్రజా లబ్దిచేకూర్చే పధకాలను ఈ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని అన్నారు సురేష్ ప్రభు. రాష్ట్రానికిరైల్వే జోన్ ప్రకటించామని, రైల్వే మంత్రిగా చేసిన సమయంలో. ఆ ప్రక్రియలో భాగ స్వామిగా ఉన్నట్టు చెప్పారు..రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్రానికి,భాజపా కి ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం కంటే ఎక్కువే సహకారం ఈ రాష్ట్రానికి దక్కుతోందని సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు.. బైట్: సురేష్ ప్రభు ( కేంద్ర మాజీ మంత్రి ). ......ఎండ్ ......

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.