విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. రూ.20,928 కోట్ల నుంచి రూ.26,264 కోట్లకు సవరించినట్లు పెట్రోలియం శాఖ వెల్లడించింది. హెచ్‌పీసీఎల్ ఆధునికీకరణ ప్రాజెక్టును 2016లో ఆమోదించినట్లు పేర్కొన్న కేంద్రం.. 2020 జులై నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లినట్లు తెలిపింది. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్ 2022-23 నాటికి పూర్తి చేస్తామని పేర్కొంది. 2022 ఫిబ్రవరి నాటికి 85 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించింది. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు.. పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి: భర్త కోసం మంత్రి పదవి త్యాగం చేసిన జెన్నిఫర్!