ETV Bharat / city

FRAUD: నలుగురితో పెళ్లి.. మరొకరితో వివాహానికి సిద్ధం - ccrb-head-constable-appalaraju

FRAUD : నలుగురితో పెళ్లి... మరొకరితో వివాహానికి సిద్ధం

author img

By

Published : Oct 4, 2021, 1:01 PM IST

Updated : Oct 4, 2021, 3:52 PM IST

12:52 October 04

విశాఖలో వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్లికొడుకు నిర్వాకాలు

FRAUD : నలుగురితో పెళ్లి... మరొకరితో వివాహానికి సిద్ధం

విశాఖలో నిత్య పెళ్లికొడుకు నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. 4 పెళ్లిళ్లు(four marriages) చేసుకున్న సీసీఆర్‌బీ హెడ్‌ కానిస్టేబుల్(CCRB head constable).. అయిదో పెళ్లికి సిద్ధపడటంతో మొదటి భార్య మహిళా చేతన సంస్థను ఆశ్రయించింది. వారి సహకారంతో దిశ పోలీస్ స్టేషన్(Disha police station)​లో ఫిర్యాదు చేసింది. 

విశాఖ సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న అప్పలరాజు.. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పద్మ మహిళా చేతనను ఆశ్రయించారు. ప్రెస్​క్లబ్​లో బాధితురాలు సమావేశం నిర్వహించి.. వివరాలు వెల్లడించారు. అయిదో పెళ్లికి సిద్ధమైన అప్పలరాజును నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె వాపోయారు. తనకు నాలుగుసార్లు గర్భస్రావం చేయించాడని కన్నీటిపర్యంతమయ్యారు. మహిళా చేతన అండతో దిశా పోలీసుస్టేషన్​లో కానిస్టేబుల్ అప్పలరాజుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పలరాజును తక్షణమే విధుల నుంచి తొలిగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

 ఇదీచదవండి.

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్ కాలేజీలో ఇంటర్‌ తరగతులు నిలిపివేత

Last Updated : Oct 4, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.