ETV Bharat / city

కోర్టులపై అభ్యంతరకర పోస్టులు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం - సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్​లపై సీబీఐ కేసు

సీబీఐ కేసు
సీబీఐ కేసు
author img

By

Published : Nov 16, 2020, 5:03 PM IST

Updated : Nov 17, 2020, 6:30 PM IST

17:00 November 16

సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తులపై సామాజిక మాధ్య‌మాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 17 మందిపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఫేస్​బుక్, ట్విట్టర్ తదితర మాధ్యమాల్లో న్యాయ వ్య‌వ‌స్థపై అనుమానాలు క‌లిగే విధంగా దురుద్దేశంతో పెట్టిన పోస్టుల‌పై సీఐడీ చ‌ర్య‌లు స‌క్ర‌మంగా లేవ‌ని అభిప్రాయ‌ప‌డిన ఉన్న‌తన్యాయ‌స్థానం కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఎనిమిది వారాల్లోనే త‌మ‌కు సీల్డ్ క‌వ‌ర్​లో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సీబీఐ తాజాగా కేసు న‌మోదుచేసింది.

రాష్ట్ర ఉన్నత  న్యాయ‌స్థానాన్ని, న్యాయ‌మూర్తుల‌ను కించ‌ప‌రుస్తూ సమాజికమాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సీబీసీఐడీ నుంచి  సీబీఐకి కేసుల బదలాయింపు జరిగింది.  హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ బి.రాజ‌శేఖ‌ర్ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ అప్పట్లో కేసులు నమోదు చేసింది. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు.. సామాజిక మాధ్య‌మాలు, ఎల‌క్ట్రానిక్ మీడియా ఇంట‌ర్వ్యూల‌ ద్వారా... హైకోర్టుా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కులం పేరిట దూషిస్తూ..అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నది.. ఆ ఫిర్యాదు సారాంశం. అక్టోబర్ 12వతేదీన జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిల నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు.. సీబీఐ పని ప్రారంభించింది. ఇప్పటివరకూ 17మందిపై 12 కేసులు నమోదయ్యాయి. వాటన్నింటినీ ఒకే కేసుగా పరిగణిస్తూ.. సీబీఐ ఎఫ్.ఐ.ఐర్ నమోదు చేసింది.  సీబీఐ ఎస్పీ విమలాదిత్య పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగనుంది. ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీ 154, 153 ఏ, 504, 505 ల ప్రకారం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్​లను కలుపుతూ ఒకే కేసుగా దర్యాప్తు చేయనున్నారు.

కొండారెడ్డి ధ‌ర్మా​రెడ్డి, మ‌ణి అన్నపురెడ్డి, సుధీర్ పాముల‌, ఆద‌ర్శ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, అవుతు శ్రీ‌ధ‌ర్ రెడ్డి, జ‌ల‌గం వెంక‌ట స‌త్యనారాయ‌ణ‌, జి.శ్రీ‌ధ‌ర్ రెడ్డి, లింగారెడ్డి, చందురెడ్డి, సుస్వరం శ్రీ‌నాధ్, కిషోర్ రెడ్డి, చిరంజీవి, లింగారెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, కె. గౌత‌మిల‌తో క‌లిపి మొత్తం 16 మంది పేర్లను ఎఫ్.ఐ.ఆర్​లో నిందితులుగా న‌మోదు చేశారు. 17వ వ్యక్తిగా గుర్తుతెలియ‌ని నిందితుడిని సీబీఐ చేర్చింది. వాస్తవంగా 48 మందిపై హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ మాత్రం 16 మందిపైనే కేసులు న‌మోదు చేసింది. ఒక‌రు కువైట్, మ‌రో ఇద్దరు విదేశాల్లో వేర్వేరు ప్రాంతాల‌ నుంచి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన‌ట్టు గుర్తించారు. మిగిలిన వారంతా దేశం నుంచే ఈ పోస్టులు పెట్టిన‌ట్టు గుర్తించారు.

సీఐడీ పనిచేయకపోవడంతో...

న్యాయవ్యవస్థపై అనుచుతి వ్యాఖ్యలు చేస్తున్న కేసును ఉన్నత న్యాయస్థానం ముందుగా సీబీసీఐడీకి అప్పగించింది. హైకోర్టు రిజిస్టార్ జనరల్ ఫిర్యాదుపై సీబీసీఐడీ 17మందిపై కేసులు నమోదు చేసింది. అయితే ఆ దర్యాప్తు సరైన రీతిలో సాగక పోవడంపై అక్టోబర్ 12 వ తేదీన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు తర్వాత కూడా  దాడి ఆగడం లేదని..  న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారా..? అని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిల నేతృత్వంలోని బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.  ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ఒక కొత్త పొక‌డను హైకోర్టు గ‌మ‌నిస్తోంద‌ని, హైకోర్టును, న్యాయ‌మూర్తుల‌ను వివిధ సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా, ఎల‌క్ట్రానిక్ మీడియాకి ఇచ్చిన కొన్ని ఇంట‌ర్వ్యూల‌లోనూ ఇదే ధోర‌ణితో ఒక దురుద్దేశ‌పూరితంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. సీఐడీ అద‌న‌పు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్, సైబ‌ర్ క్రైం ఎస్పీ, స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్​లు వేగంగా, స్థిరంగా ద‌ర్యాప్తు చేయకుండా ఉదాసీనంగా ఉన్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. న్యాయ‌వ్య‌వ‌స్థపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ట్వీట్ల ద్వారా దాడి చేయ‌డం ఒక గ‌ర్వంగా భావిస్తున్నార‌న్న అంశాన్ని ప‌ట్టించుకోలేద‌ని వ్యాఖ్యానించింది. ఇటువంటి ప‌రిణామాలు న్యాయ‌వ్య‌వ‌స్థపై ప్ర‌జ‌ల‌కు అన‌వ‌స‌ర అనుమానాల‌ను క‌లిగిస్తాయ‌ని... మొత్తం వ్య‌వ‌స్థకే ఇది మంచిది కాద‌ని కూడా హైకోర్టు బెంచి ఈ కేసు సంద‌ర్భంగా వ్యాఖ్యానించింది. ఆ తర్వాత కేసును సీబీఐకు బదిలీ చేస్తూ.. ఆదేశాలిచ్చింది. కేసును డిసంబర్ 14వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఎనిమిది వారాల్లో కోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని కోరింది. 

కుట్రకోణం ఉందా...?

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా ఇవ్వాలని కోర్టు కోరింది. హైకోర్టు రిజిస్టార్ జనరల్ దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థపై దాడి వెనుక కుట్రకోణం ఉందేమో చూడాలని.. అలాంటిది జరిగితే నిందితుల హోదా, స్థాయితో సంబంధం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 

ఇదీ చదవండి :   వర్ల రామయ్య ఆరోపణలు నిరాధారం: ఎస్పీ విశాల్

Last Updated : Nov 17, 2020, 6:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.