ETV Bharat / city

బెదిరింపు ముఠాల వ్యవహారం... మరో వర్గం స్పందన

విశాఖ నగరంలో కలకలం రేపిన భూ బెదిరింపు ముఠాల వ్యవహరానికి సంబంధించి... కృష్ణమోహన్ అనే వ్యక్తి స్పందించారు. తాము భూబెదిరింపు ముఠా కాదని... తమకు రావాల్సిన భూమి కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు.

బెదిరింపు ముఠాల వ్యవహరం... మరో వర్గం స్పందన
author img

By

Published : Sep 22, 2019, 11:51 PM IST

బెదిరింపు ముఠాల వ్యవహరం... మరో వర్గం స్పందన

విశాఖలో కలకలం రేపిన భూ బెదిరింపు ముఠాల వ్యవహరానికి సంబంధించి... మరో వర్గం స్పందించింది. తాము భూబెదిరింపు ముఠా కాదని... తమకు రావాల్సిన భూమి కోసం పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీడియాలో రావడం... పులివెందుల ముఠాలు విశాఖలో తిష్ట వేశాయని పారిశ్రామికవేత్త నరేష్​కుమార్ చెప్పడంతో విషయం పెద్దదయ్యింది. పారిశ్రామికవేత్త నరేష్​కుమార్ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో... సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వారి తరపున కృష్ణమోహన్ అనే వ్యక్తి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

విశాఖ మర్రిపాలెంలోని సర్వే నెంబర్ 81/2, 81/3లో ఉన్న 6.8 ఎకరాలు ఎల్లపు నాగేశ్వరావు ఎల్లపు ఈశ్వరావుకు చెందినదిగా... ఆ భూమిని నరేష్​కుమార్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని 2013లో తనను కొందరు ఆశ్రయించినట్లు కృష్ణమోహన్ తెలిపారు. 2013 నుంచి దీనిపై వివాదం కొనసాగుతోందని... దీనిని పరిష్కరించుకోనేందుకు నరేష్​కుమార్ స్నేహితుడైన మరో పారిశ్రామికవేత్తతో మాట్లాడినట్లు వివరించారు. అందుకే వెళ్లారని... వెళ్లిన వారిలో హైదరాబాద్ నుంచి వచ్చిన రామిరెడ్డి, నాగిరెడ్డి, రామాంజనేయులు, పారిశ్రామిక వేత్త సాంబశివరావులు ఉన్నారని తెలిపారు.

డీల్ కుదరకపోవడంతో ముఠాలు వచ్చి... డబ్బులు దోచుకుంటున్నాయని ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కృష్ణమోహన్ వర్గం ఆరోపిస్తుంది. గత ఆదివారం వారు వెళ్తే ఈ ఆదివారం మీడియాకు ఇవ్వడం, మంత్రిని కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాము ఎవరినీ బెదిరించలేదని... ఇదే విషయమై తాము నరేష్​కుమార్​పై నగర పోలీస్ కమిషనర్​కు పిర్యాదు చేసి స్థలం కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండీ... తప్పు చేశారు.. ఇప్పుడేం చెబుతారు?: లోకేశ్

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వ్యవసాయానికి సాగునీరు అందించే చెరువుల నుంచి ప్రజలకు తాగునీరు అందించే చెరువు వరకు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వీటితోపాటు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వీటిని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలు హద్దుమీరు తున్నాయి. కబ్జాదారులు ఆక్రమించుకున్న భూముల్లోఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు ,ప్రజలు ఆరోపిస్తున్నారు.

Body:ద్వారకాతిరుమల మండలంలో ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమణలకు గురవడం పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .ఇందులో కొన్ని చెరువులు 80% పైగా ఆక్రమణలకు గురవగా.. కొన్ని చెరువులు ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాయి. ఆక్రమణదారులు వీటిని ఆక్రమించుకుని వరి, కొబ్బరి, జామాయిల్ వంటి పంటలను సాగు చేస్తున్నారు. దీంతో ఆయకట్టు పొలాలకు సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపురం ,సత్తాల గ్రామాలలో సర్వే నంబరు 365, 205 లలో 57 .68ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు చెరువులు ఉండగా సుమారు 50 ఎకరాలకు పైగా చెరువులను పూడ్చి వరి సాగు చేస్తున్నారు. దీంతో చెరువులో నీరు నిల్వ లేక సుమారు 125 ఎకరాల మేర ఆయకట్టు పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పి .కన్నాపురం పంచాయతీ పరిధిలో దాడవల్లిలో సర్వే నంబర్ 60లో 8.36 పంచాయతీ చెరువు భూమి పూర్తిగా ఆనవాలు లేకుండా కబ్జాకు గురైంది .అలాగే పి. కన్నాపురం సర్వే నంబరు142/2,150/3 లలో సుమారు 4.44 ఎకరాల చెరువు భూమి అన్యాక్రాంతమైనది. అలాగే దొరసానిపాడు సర్వే నంబరు 308 లో 0.94 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకుని వరి సాగు చేస్తున్నారు. రామన్నగూడెం సర్వే నంబరు 114 లో 43 .77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయకట్టు చెరువును కొంతమంది స్వార్థపరులు ఆక్రమించుకుని ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ చెరువు కింద ఉన్న సుమారు 115 ఎకరాల ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామంలో సర్వే నంబరు 46/1ఎ లో 12.57 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 7. 57 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఆయా భూముల్లో అక్రమార్కులు ధీమాగా వ్యవసాయం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Conclusion:1.పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు 2.ది .అన్నవరం 3.మనల్లి దుర్గారావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.