BSF IG Satish Chandra: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో బీఎస్ఎఫ్ క్యాంప్లు ఏర్పాటైన తర్వాత మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో జవాన్లు బాగం అయ్యారని బీఎస్ఎఫ్ ఐజీ సతీష్ చంద్ర బూడకోటి అన్నారు. జవాన్లు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. మావోయిస్టులు ప్రాబల్యం వల్ల గతంలో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండేదన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు రహదారుల నిర్మాణం సాగుతోందన్నారు. మారుమూల ప్రాంతాలకూ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని... అధికారులు సందర్శిస్తున్నారని తెలిపారు. మార్చి 5న ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని బోండా ఆదిమజాతి గిరిజనులు నివసించే అండ్రహల్ గ్రామం వద్ద ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపును ఆయన సందర్శించారు. బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఆదివాసీ సంప్రదాయమైన దింస నృత్యం చేశారు.
ఇదీ చదవండి: సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి