విశాఖలో తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఆరిలోవ ఆదర్శనగర్కు చెందిన భార్గవి అనే యువతి డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. తల్లిదండ్రులు తనకు బలవంతపు ఇష్టం లేని వివాహం చేస్తున్నారంటూ పోలీసులకు తెలిపింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆ బలవంతపు పెళ్లిని అడ్డుకున్నారు.
సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహించిన భార్గవి తల్లిదండ్రులు.. ఆమెపై చేయిచేసుకున్నారు. తల్లిదండ్రులు బారి నుంచి తనను కాపాడాలంటూ.. మహిళ చేతన అనే సంఘాన్ని భార్గవి ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మహిళా సంఘాల ప్రతినిధులు యువతికి ఆమె ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. యువతి మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు.
ఇదీ చదవండి: