రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకుండా గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నారాయణ కమిటీ చెప్పినట్లు అమరావతిని ఎంపిక చేశారన్న బొత్స... శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టారని విశాఖలో వ్యాఖ్యానించారు. స్వార్థం, స్వలాభం కోసమే ఆలోచించారన్న మంత్రి... లక్షల క్యూసెక్కులకే ఆ ప్రాంతం ముంపునకు గురవుతోందని అన్నారు.
వోక్స్ వ్యాగన్ కేసు నోటీసుపై స్పందించిన మంత్రి బొత్స... కోర్టు నుంచి ఇంకా ఎలాంటి కాపీ తనకు అందలేదని తెలిపారు. నెలరోజులుగా సీబీఐ అధికారులు సంప్రదిస్తున్నారని తెలిపారు. సాక్ష్యం చెప్పేందుకు ఎప్పుడు వీలవుతుందని అడిగారన్న మంత్రి... నోటీసులు అందాక కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెబుతానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...