PRC Sadhana Samithi deeksha at Vizag: చర్చల విషయంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలపై దుష్ప్రచారం చేస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. వెంటనే తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తే చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. విశాఖలో పీఆర్సీ సాధన సమితి మహిళా ఐకాస చేపట్టిన దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాటం సాగించాలని సూచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద మోసపోయాం. నల్లబ్యాడ్జీలతో వస్తే సీఎంతో చర్చలు కుదరవన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫిట్‌మెంట్ ఎక్కువ ఇవ్వలేంటున్నారు. ఇప్పుడు ఫిట్‌మెంట్ వారికి ఇష్టమొచ్చినట్లు ప్రకటించారు. మేం ఒప్పుకున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. తమ డిమాండ్లపై స్పందిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాం. - బొప్పరాజు, పీఆర్సీ సాధన సమితి నేత
Bopparaju at Vizanagaram: విజయనగరంలో దీక్షలకు సంఘీభావం
అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగామని.. ఎవరికీ భయపడేది లేదని ఉద్యోగు సంఘాల నేత బొప్పరాజు అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్క అడుగు ముందుకేస్తే మేం 4 అడుగులు వేస్తామన్నారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తేవొద్దని ఆయన కోరారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
'గతంలోనే మా డిమాండ్లను ప్రభుత్వానికి వివరించాం. వాటిని పట్టించుకోకుండా చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారు. వాటిని సరిదిద్దాలి. మా డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలి. అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగాం. ఎవరికీ భయపడేది లేదు' అని బొప్రరాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు