నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త శ్రీభరత్ తరపున ఆమె ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. తెదేపా అభ్యర్థుల గెలుపునకు ప్రజలు కృషి చేయాలని కోరారు. తెదేపా ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా తెదేపా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని వ్యాఖ్యానించారు. తేజశ్వినితో పాటు ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంటా కుమార్తె సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.
ఇదీ చదవండి