విశాఖ శిశు గృహంలో దత్తత కార్యక్రమం... చెన్నై దంపతులకు అప్పగింత
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సమక్షంలో విశాఖ శిశు గృహానికి చెందిన నాలుగు నెలల చిన్నారికి దత్తత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గత సంవత్సరం అక్టోబర్ 28న ఓ తల్లి వదిలివెళ్లిన శిశువును..విశాఖ శిశు గృహంలో ఉంచారు. బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం మంత్రి సమక్షంలో చెన్నైకు చెందిన దంపతులకు దత్తత కార్యక్రమం నిర్వహించి... చిన్నారి అవనిని వారికి అందించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా, జిల్లా బాలల సంరక్షణాధికారి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ శిశు గృహంలో దత్తత కార్యక్రమం... చైన్నై దంపతులకు అప్పగింత
ఇవీ చూడండి-మా ఇంటి మహాలక్ష్మి అన్నారు.. ఆ తర్వాత..?