ETV Bharat / city

ఆటోల ద్వారా దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - విశాఖ పోలీసుల తాజా వార్తలు

విశాఖలో ఆటోల ద్వారా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నగర పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టినట్టు నేర విభాగపు డీసీపీ వి.సురేష్​ బాబు తెలిపారు.

auto robbery gang caught by vizag police and send to remand
నేర విభాగపు డీసీపీ వి. సురేష్​ బాబు
author img

By

Published : Sep 24, 2020, 10:23 PM IST

నగరంలో ఆటోల ద్వారా దోపడీలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న గణేష్, నాగమల్లి ఎల్లాజీ, తాళ్లూరి కుమార్ సహా ముగ్గురు మైనర్లు ఓ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు నేర విభాగపు డీసీపీ వి.సురేష్​ బాబు తెలిపారు. కొద్ది రోజులు కిందట పాత గాజువాకలో ఆటోడ్రైవర్​ని బెదిరించి ఆటోని దోపిడీ చేశారని చెప్పారు. కూర్మన్నపాలెం వద్ద వాహనం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు యువతులను బలవంతంగా ఆటో ఎక్కించి నాలుగు వేల నగదును కాజేశారు. అనంతరం యువతులను ఆటోలో నుంచి తోసేశారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వారికి వైద్య సహాయం అందించి అనంతరం యువతుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. నిందితులు పాత నేరస్థులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరిలో ఎల్లాజీ అనే వ్యక్తి ఇటీవల రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి నుంచి 13 వేల నగదును కూడా దోపిడీ చేసినట్టు నేర విభాగపు డీసీపీ వి.సురేష్ బాబు తెలిపారు.

ఇదీ చదవండి :

తప్పించుకు తిరుగుతున్న రిమాండ్ ఖైదీ హరీశ్ రెడ్డి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.