విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సత్తుపాటి ప్రసన్నశ్రీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి-2021 పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2020, 2021 సంవత్సరాలకు కలిపి మొత్తం 28 మందికి రాష్ట్రపతి పురస్కారాలు అందించగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసన్నశ్రీ ఒక్కరే ఉన్నారు.
ఏయూలో ప్రొఫెసర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఈమె అల్పసంఖ్యాక గిరిజన భాషల సంరక్షణకు కృషిచేస్తూ వాటికి లిఖిత రూపాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆమె భగత, గడభా, కోలమి, కొండ, దొరలాంటి 19 గిరిజన భాషలకు అక్షరాలు, సంఖ్యలను రూపొందించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. మహిళలపై పలు పుస్తకాలు రాశారు. ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎండేజర్డ్ ఆల్ఫాబెట్స్, యూఎస్‌ఏ(2019)’ గుర్తింపు పొందిన తొలి భారతీయ, ఆసియా మహిళగా పేరొందారు.
ప్రసన్నశ్రీకి ఉపరాష్ట్రపతి అభినందనలు..
ఏయూ అధ్యాపకురాలు నారీశక్తి పురస్కారం-2021 అందుకున్న ఎస్.ప్రసన్నశ్రీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.