విశాఖలో ఆశావర్కర్లు నిరసన గళం విప్పారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు అన్యాయం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆశాలను సచివాలయాలకు అప్పజెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ... విశాఖలో ఆశావర్కర్లు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారి తీసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడినుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద విశాఖ నగర పోలీసులు అడ్డుకున్నారు. నిరసన చేస్తున్నవారిని అరెస్ట్ చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
10వేల రూపాయల జీతం అంటూ ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం... ఒకేసారి రూ. 10 వేలు జీతం చెల్లించకపోవడమే కాక కేటగిరీలు పెట్టిందని వాపోయారు. ఇచ్చే జీతం విడతల వారీగా ఇస్తున్నప్పటికీ... తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి సంక్షేమ పథకాలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: