ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల కార్మికులు విశాఖపట్నం ఉప కార్మిక శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కాలానికి తమకు జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్డౌన్ కారణంగా విశాఖ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 450 మంది అద్దె బస్సు డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ గోడు వెల్లబోసుకున్నారు. మూడు నెలలుగా బస్సులు తిరగకపోవటంతో బస్సు యజమానులు తమకు జీతాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానులకు ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారని కార్మికులు చెప్పారు. అయితే ఆ సొమ్ము నుంచి తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదంటూ వాపోయారు. విధుల్లో చేరే వరకూ తమకు రూ.10వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోండి' - rtc drivers protest news in telugu
ఏపీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విధుల్లో చేరే వరకూ తమకు రూ.10వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరారు.

ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల కార్మికులు విశాఖపట్నం ఉప కార్మిక శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కాలానికి తమకు జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్డౌన్ కారణంగా విశాఖ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 450 మంది అద్దె బస్సు డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ గోడు వెల్లబోసుకున్నారు. మూడు నెలలుగా బస్సులు తిరగకపోవటంతో బస్సు యజమానులు తమకు జీతాలు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానులకు ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారని కార్మికులు చెప్పారు. అయితే ఆ సొమ్ము నుంచి తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదంటూ వాపోయారు. విధుల్లో చేరే వరకూ తమకు రూ.10వేలు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: టూరిజం కంట్రోల్ రూమ్‌లను ప్రారంభించిన సీఎం జగన్