సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో 27 అభివృద్ధి పనులకు సభ్యులు బోర్డు ఆమోదం తెలిపింది. సీతమ్మధార వద్దనున్న ఆంజనేయ స్వామి దేవాలయానికి 1000 గజాల స్థలం ఇవ్వాలనే ప్రతిపాదనను నలుగురు సభ్యులు తిరస్కరించారు. ఆలయ పరిసర ప్రాంతం, రోడ్డుకు 300 గజాల స్థలానికే అనుమతి ఉందని అన్నారు.
ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. బోర్డు అయినా, అధికారులైనా భక్తుల అవసరాలు, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. దేవాలయ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఆనాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించానని వెల్లడించారు. అప్పన్న కృప వల్ల చట్టం ప్రకారం ఛైర్మన్గా కొనసాగే అర్హత తనకే ఉందని తీర్పు వెల్లడైందన్నారు. తాను ఛైర్మన్గా కొనసాగని.., రెండు సంవత్సరాల కాలంలో ట్రస్ట్ బోర్డ్ ఆమోదం లేకుండా ఎన్ని అనుమతులు ఇచ్చారన్నది తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగమే అంతిమమైనది అన్న విషయం పద్మనాభం, రామతీర్థం దేవాలయాల ద్వారా నిరూపితమైందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి