ETV Bharat / city

స్వచ్ఛత దిశగా రిషికొండ బీచ్ మరో అడుగు..! - రిషికొండ బీచ్​ తాజా వార్తలు

సుదీర్ఘ తీర ప్రాంతం, ఎన్నో బీచ్​లు, ఏటా లక్షలాది మంది పర్యాటకులు, మైమరపించే ప్రకృతి అందాలు... ఇలా అనేక ప్రత్యేకతలున్నాయి కోస్తాంధ్రకు. కానీ మణిహారంగా నిలిచే ఒక్క అంతర్జాతీయ స్థాయి బీచ్ కూడా లేదు. అయితే ఆ లోటును దూరం చేసేందుకు మన రుషికొండ బీచ్ సిద్ధమవుతోంది. అబ్బురపరిచే హంగులతో స్వాగతం పలికేందుకు సొబగులు అద్దుకుంటోంది. ఆ దిశగా 'ఐ యామ్ సేవింగ్ మై బీచ్' అంటూ ప్రతి ఒక్క సందర్శకుడు ప్రతినబూనాల్సిన సమయం ఆసన్నమైంది.

rishikonda beach
rishikonda beach
author img

By

Published : Sep 25, 2020, 10:09 PM IST

విశాఖ సాగరతీరం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. యారాడ నుంచి భీమిలీ వరకు ఇసుక తిన్నెలతో సుందర కాంతులను పంచే బీచ్​లు ఎన్నో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పర్యాటకంగా ఎంతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న మన సాగర నగరికి బ్లూ ఫ్లాగ్ దక్కించుకునే అరుదైన అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పుడు రుషి కొండ బీచ్​ను బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం తీర్చిదిద్దుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఇప్పటికే అనేక సదుపాయాలు ఇక్కడ కల్పించారు.

పరిశుభ్రత, భద్రత లక్ష్యాలుగా ప్రభుత్వం చేసే అభివృద్ధి ఓ వైపు అయితే... సందర్శకులు కూడా భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చింది. అద్భుత తీర ప్రాంతం అందాలను ఆస్వాదించడానికి రుషికొండకు వెళ్తున్నారా..? అయితే 'ఐ యామ్ సేవింగ్ మై బీచ్' అని అనాల్సిందే. ఉన్నత లక్ష్యం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని విజయ తీరాలకు చేర్చటంతో సందర్శకుల పాత్ర ఎంతో కీలకంగా మారింది.

వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించే వ్యవస్థ ఇప్పుడు రుషికొండ బీచ్​లో అందుబాటులో ఉంది. అయితే.. స్వచ్ఛ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వ్యర్థాలను ఇసుక తిన్నెలపై విడిచిపెట్టకూడదు. బీచ్​ను పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం, వ్యర్థాల శాపాన్ని సందర్శకులే దూరం చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ మా బీచ్ ను మేము కాపాడుకుంటాం అని నినదించాలి. అందుకే రుషికొండ తీరంలో ఓ యువ బృందం సముద్ర గర్భంలోని వ్యర్థాలను సైతం తొలగిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తోంది.

ఇటీవలే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ 'ఐ యామ్ సేవింగ్ మై బీచ్' జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ శ్రేణి పర్యాటక నగరంగా గుర్తింపు దక్కించుకునేందుకు బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ ఎంతో దోహదం చేయనుంది.ఆ దిశగా ప్రజలు సహకరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.