ప్రైవేటు సంస్థ నుంచి లీజుకు తీసుకొని ఆంధ్రజ్యోతి పత్రిక ముద్రణ కేంద్రం నిర్వహిస్తున్న పారిశ్రామిక గోదాము/భవనం కూల్చివేతపై యథాతథ స్థితి పాటించాలని ఏపీఐఐసీ అధికారులను హైకోర్టు బుధవారం ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఆదేశాలిచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఏపీఐఐసీ అధికారులు భవనాన్ని కూల్చడానికి వచ్చారని, దాన్ని నిలువరించాలని ‘ఆంధ్రజ్యోతి’ విజయవాడ శాఖ మేనేజరు వేమూరి మురళి అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
ఇదీ చదవండి