ఓ భుజానికి వ్యాక్సిన్ డబ్బా, మరో వైపు చేతి సంచి తగిలించుకొన్న ఓ ఏఎన్‌ఎం.. నడుము లోతు వరకు నీరు ప్రవహిస్తున్న వాగును దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. కఠిన పరిస్థితుల్లోనూ విధులపై ఆమె చూపిన అంకితభావం, చేసిన సాహసం తెలుసుకున్న స్థానికులు అభినందనలు తెలిపారు. విశాఖ మన్యంలోని మూలపేట పంచాయతీ పొర్లుబంద చేరుకోవాలంటే పెద్ద కొండవాగు దాటాలి. డౌనూరు పీహెచ్‌సీ ఏఎన్‌ఎం ఎన్.సత్యవతి శనివారం తాడు సాయంతో ఆ గెడ్డ దాటి వెళ్లి 40 మందికి టీకా వేశారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది గతంలోనూ మన్యంలో కొండలు దాటి వెళ్లి పొలాల వద్ద పనులు చేసుకుంటున్న గిరిజనులకు టీకాలు వేశారు.
ఇదీచదవండి. Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం