విశాఖ విమానాశ్రయంలో (Visakhapatnam Airport) మంగళవారం టి.సుజాత అనే వృద్ధురాలు నుంచి 13 రౌండ్ల బుల్లెట్లను (Pistol Bullets) విమానాశ్రయ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వయస్సు రీత్యా ఆమెకు స్టేషన్ బెయిల్ ను మంజూరు చేశారు.
బుల్లెట్లు ఎలా వచ్చాయంటే....
వృద్ధురాలి పెదనాన్న హంటింగ్ (Hunting) చేసే వారని, అప్పట్లో ఆయనకు తుఫాకీ లైసెన్సు కూడా ఉండేదని ఆమె పోలీసులకు తెలిపింది. ఆయన 1999లో మరణించాడని, ఆ బుల్లెట్లు అంతకు ముందు నుంచే తన దగ్గర ఉన్న ట్లుగా తెలిపారు. బ్యాగ్ లో బుల్లెట్లు ఉండిపోయానని, వాటిని తాను ముందుగా చూసుకోకుండా...బట్టలు పెట్టి పొరపాటున తీసుకువచ్చానని ఆమె పోలీసులకు వివరించారు.
ఇదీ చదవండి : Gas cylinder explosion : పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం..