ETV Bharat / city

'దేశ ఆర్థిక వ్యవస్థ దయనీయ స్థితిలో ఉంది' - వైజాగ్​లో పల్లంరాజు ప్రెస్ మీట్ వార్తలు

భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 4.9 శాతం మాత్రమే ఉంటే.. దేశంలో 8.91శాతం ఉందన్నారు.

పళ్లంరాజు మీడియా సమావేశం
author img

By

Published : Nov 10, 2019, 11:26 AM IST

భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి పళ్లంరాజు అన్నారు. విశాఖ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్​లో భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. 'నేషనల్ శాంపిల్ సర్వే' అధ్యయనం ప్రకారం దేశంలో 8.91% నిరుద్యోగం ఉందనీ.. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇండస్ట్రీ' సర్వే ప్రకారం అది 8.5 శాతంగా ఉందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 4.9 శాతం మాత్రమే ఉందన్నది గుర్తించాలన్నారు.

పళ్లంరాజు మీడియా సమావేశం

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతంగా ఉందనీ.. ఈసారి వృద్ధి శాతం ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉందని.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంకు అంచనా వేస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థని పురోగమన దిశగా నడిపించే మౌలిక రంగాలైన బొగ్గు, విద్యుతు, సిమెంటు, నిర్మాణ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పళ్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడంలో విఫలమైందనీ.. కశ్మీర్, అయోధ్య వంటి అంశాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి..

'రాష్ట్రంలో అవినీతి లేదని చెప్పే ధైర్యం ఉందా..?'

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా. ap_vsp_71_09_AICC_on_indian_economy_ab_AP10148 ( ) భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితిలో ఉందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసిసి ) ప్రధాన కార్యదర్శి పల్లంరాజు అన్నారు. విశాఖ వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్ క్లబ్లో భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ దృక్కోణాన్ని ఆయన వెల్లడించారు. నేషనల్ శాంపిల్ సర్వే అధ్యయనం ప్రకారం దేశంలో 8.9 1% నిరుద్యోగం ఉందని, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఇండస్ట్రీ సర్వే ప్రకారం నిరుద్యోగం 8.5 శాతం ఉందని వెల్లడైందని పళ్లంరాజు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 4.9 శాతం మాత్రమే ఉందన్నది గుర్తించాలన్నారు.

Body:ఇంకొకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతంగా ఉందని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంకు ఈసారి వృద్ధి శాతం ఇంకా తక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థని పురోగమన దిశగా నడిపించే ముఖ్య మౌలిక రంగాలయిన బొగ్గు, విద్యుత్, సిమెంటు, నిర్మాణ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పళ్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:ఈ నేపథ్యంలో 20 సంవత్సరాలలో అతి తక్కువ పెట్టుబడులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. బ్యాంకులో తాము దాచుకున్న సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం లేక సామాన్యులు పొదుపుబ్యాంకు లపై నమ్మకం కోల్పోవడంతో పొదుపు వ్యవస్థ కూడా దేశంలో దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజలు 2 ప్రాంతీయ పార్టీల వైపు మక్కువ చూపుతున్నారని, అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడంలో విఫలమై, కశ్మీర్,అయోధ్య వంటి అంశాలతో ప్రజానీకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బైట్: పళ్ళంరాజు,ఎ.ఐ.సి.సి.ప్రధాన కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.