విశాఖలోని ఛాతి ఆసుపత్రి ఎదుట కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న బాధితులు ఆందోళన చేపట్టారు. 20 మందికిపైగా పురుషులు, మహిళలు మూడు రోజులుగా తిరుగుతున్నా… కనీసం పరీక్షలు చేయడానికి వైద్యులు అందుబాటులో లేేరని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ లోపలకి కూడా రానివ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ లక్షణాలు తమ అందరిలోనూ కనిపించడం వల్లే ఆందోళనతో హాస్పిటల్ దగ్గరికి వస్తే ఇవాళ, రేపు అని తిప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తాము ఆసుపత్రుల వెంట తిరిగినప్పుడే లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది ఇది గుర్తించి తమను పరీక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఫిట్స్‌తో కింద పడ్డాడు.. విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు