సినీనటుడు అడివి శేషు విశాఖలో సందడి చేశారు. విశాఖ రామకృష్ణ బీచ్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద విశాఖ పోలీస్ కమిషరేట్, దిశ వింగ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సినీ నటుడు దర్శకుడు అడవి శేషు పాల్గొన్నారు. దిశ చట్టం గురించి అవగాహన కల్పించి.. దిశా యాప్‌ను మహిళలందరూ వినియోగించుకోవాలని సూచించారు. మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
అన్నాచెల్లెళ్లు పండుగైన రాఖీ రోజున దిశ యాప్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ దిశ యాప్ లో పెట్టే ఫిర్యాదులకు తక్షణమే పోలీసులు స్పందిస్తారని చెప్పుకొచ్చారు. విశాఖ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గౌతమీ శాలి, ఏసీపీలు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
ఇదీ చదవండి: alluri : స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు... సాయుధ పోరాటంలో అసాధ్యుడు