ETV Bharat / city

'ఎన్నికల నియమావళి అతిక్రమించారు.. ఏయూ వీసీపై ఫిర్యాదు చేస్తాం' - ఎన్నికల నియమావళి అతిక్రమించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీపై ఫిర్యాదు

వైకాపా నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ కార్యక్రమంలో ఏయూ వీసీ పాల్గొన్నారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు టీఎన్​ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం.. ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు.

au vc actions against election code in visakha
ఎన్నికల నియమావళి అతిక్రమించిన ఏయూ వీసీపై ఫిర్యాదు
author img

By

Published : Mar 1, 2021, 6:09 AM IST

విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశాన్ని వైకాపా నిర్వహించింది. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ అన్నారు. వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయమై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్​కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరోవైపు.. రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి వైకాపా ఎంపీ విజయసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైకాపాకు నగర పాలక సంస్థ ఎన్నికల్లో సహకరించాలని కోరారు. ఇలాంటి రాజకీయ సమావేశానికి.. ఏయూ వీసీ హాజరు కావడంపై.. టీఎన్ఎస్ఎఫ్ నేతలు అభ్యతరం చెప్పారు.

ఇదీ చదవండి:

ఎన్నికల రంగంలోకి పవన్... త్వరలోనే విశాఖ పర్యటన ఖరారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.