ETV Bharat / city

ఆక్సిజన్ ప్లాంట్లలో సమస్యల పరిష్కారానికి.. నావికాదళ నిపుణుల బృందం తోడ్పాటు - oxygen plants latest news

భారత నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్నాయి. తూర్పు నౌకాదళానికి చెందిన ఆరు ప్రత్యేక బృందాలు పలు జిల్లాలలో పర్యటించి నాలుగు పరిశ్రమల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తిలో లోపాలను సరిచేశాయి. అవి పూర్తి స్థాయిలో పనిచేసేట్టుగా చర్యలు చేపట్టాయి.

oxygen plant
విశాఖ నేవల్ డాక్ యార్డు నిపుణుల బృందం
author img

By

Published : May 30, 2021, 12:15 PM IST

తూర్పు నౌకాదళంలో భాగంగా ఉన్న విశాఖ నేవల్ డాక్ యార్డు నిపుణుల బృందం రాష్ట్రంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల సమర్ధ ఉత్పత్తికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఈ బృందం... అధికారులతో కలసి నెల రోజులుగా పలు నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ సరఫరా పద్ధతులను పరిశీలించి పలు సూచనలు చేసింది. అవసరమైన మరమ్మతులు నిర్వహించింది. నిర్వహణలో ఏర్పడే సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయాలపై అక్కడి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించింది.

యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో ఆక్సిజన్ సరఫరా సమయంలో వాడే పద్ధతులను బృంద సభ్యులు.. సిబ్బందికి వివరించారు. దీని ద్వారా బాధితులకు నిరంతరాయంగా ప్రాణవాయువు అందించవచ్చని తెలిపారు. పోర్టబుల్ మల్టీ ఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్​ను స్థానికంగా ఉన్న పరిశ్రమ కార్మికులే ఎలా తయారు చేయాలో చెప్పారు. నెల్లూరులోని శ్రీకృష్ణ తేజ ఎయిర్ ప్రొడక్ట్స్ సంస్థలో 2012 నుంచి ఉత్పత్తి లేకుండా పడిఉన్న క్రయోజెనిక్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్​ను తిరిగి వినియోగంలోకి తెచ్చే సాంకేతిక సహకారం అందించారు.

ఇప్పుడు ఆ ప్లాంట్​లో ఉత్పత్తి ప్రారంభించారు. శ్రీకాళహస్తి, తిరుపతిలో వీఎస్​పీఏ ప్లాంట్​లో తయారైన ఆక్సిజన్…​ మెడికల్​ అవసరాలకు ఏ విధంగా వినియోగించవచ్చన్నదీ వివరించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆక్సిజన్ ఆన్ వీల్స్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:

NDRF: ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తిరిగి రాష్ట్రానికి చేరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.