ETV Bharat / city

విశాఖ పోర్టుకు తొలిసారి భారీ నౌక రాక - visakha latest news

విశాఖ స‌హ‌జ‌ నౌకాశ్రయానికి తొలిసారిగా ఓ భారీ నౌక ‌వచ్చింది. దాదాపు 90 వేల ట‌న్నుల లోడుతో ఎంటీ ఓస్లో అనే కార్గో నౌక చేరుకుంది. ఇటీవలే సింగ‌పూర్​కి చెందిన సంస్థ భారీ నౌక‌లు విశాఖకు రావ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను, సాంకేతిక వెసులుబాట్లపై అధ్యయనం చేసింది. విశాఖతీరం అందుకు అనువుగా ఉందని నిర్ధరించటంతో.... తొలిసారి ఇంతటి భారీనౌక నౌకాశ్రయానికి వచ్చింది.

a-huge-cargo-ship-arrived-at-visakhapatnam-port

author img

By

Published : Nov 30, 2020, 1:57 PM IST

Updated : Nov 30, 2020, 4:55 PM IST

విశాఖ నౌకాశ్రయంలో భారీ కార్గో నౌక సందడి

విశాఖ పోర్టు చ‌రిత్రలో మ‌రో అధ్యాయం మొదలైంది. తూర్పు తీరాన్ని ఏసియా ట్రాన్సిప్​మెంట్ హబ్​గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నౌకాశ్రయానికి అతి భారీ నౌక‌లు వ‌చ్చే విధంగా జ‌రిగిన అధ్యయ‌నాలు ఎట్టకేల‌కు కార్యరూపం దాల్చాయి. ఎంటీ ఓస్లో అనే కార్గోనౌక దాదాపు 90 వేల ట‌న్నుల లోడుతో ఇక్కడి నౌకాశ్రయానికి చేరింది. కెప్టెన్ శ‌ర్మ నేతృత్వంలో ఇన్నర్ హార్బర్​లోని ఈక్యూ 7 బెర్త్ వద్ద అన్ లోడింగ్ జ‌రుగుతోంది. 229.20 మీట‌ర్ల పొడ‌వు, 38 మీట‌ర్ల బీం(వెడ‌ల్పు) ఉన్న ఇంత‌టి భారీ నౌక ఇన్నర్ హార్బర్​లోకి తొలిసారిగా వ‌చ్చింద‌ని పోర్టు వ‌ర్గాలు తెలిపాయి. ఇందులో మొత్తం 87,529 మెట్రిక్ ట‌న్నుల లోడు ఉంద‌ని వెల్లడించింది.

ప్రత్యేక అధ్యయనం

విశాఖ పోర్టులో ఇంత‌వ‌ర‌కు కేవ‌లం 230 మీట‌ర్ల పొడ‌వు, 32.5 మీట‌ర్ల వెడల్పు ఉన్న నౌక‌ల‌ను మాత్రమే హ్యాండిల్ చేసే అవ‌కాశం ఉంది. భారీ నౌకలు వ‌చ్చేందుకు వీలుగా విశాఖ పోర్టు అధికారుల బృందం 2019 సెప్టెంబ‌ర్​లో డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హ‌ర‌నాథ్ నేతృత్వంలో ఒక బృందం సింగ‌పూర్​లో ప్రత్యేకంగా అధ్యయ‌నం చేసింది. సింగ‌పూర్​కి చెందిన ఫోర్స్ టెక్నాల‌జీస్ సంస్థ... విశాఖప‌ట్నం పోర్టుతో క‌లిసి అధ్యయనం నిర్వహించింది.

ప్రస్తుతం కంటైన‌ర్ టెర్మిన‌ల్​గా ఉన్న వీసీటీపీఎల్ వ‌ద్ద 320 మీట‌ర్ల పొడ‌వైన నౌక‌ల‌ను హ్యాండిల్ చేస్తున్నారు. ఈ అధ్యయనం వల్ల 397 మీట‌ర్ల పొడ‌వు, 57 మీట‌ర్ల బీం ఉన్న నౌక‌ల‌ను... ఎక్కువ టగ్ ప‌వ‌ర్ ఉన్న వాటిని కూడా ఇన్నర్ హార్బర్​లోకి తీసుకువ‌చ్చేందుకు వీల‌వుతుంది. ఇప్పటివ‌ర‌కు ఇన్నర్ హార్బర్​లో 230మీట‌ర్ల పొడ‌వు, 32.5 బీం ఉన్న నౌక‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. అధ్యయనం ద్వారా 290 మీట‌ర్ల పొడ‌వు, 45 మీట‌ర్ల బీంతో ఉన్న నౌక‌లు... 15.20 లోతు ఉన్న హై టైడ్​లో హ్యాండిల్ చేసేందుకు అవకాశం ఉంది. దీనివ‌ల్ల పోర్టు ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా పెరిగేందుకు వీల‌వుతుంది. తూర్పు తీరంలో ఇంత‌టి భారీ నౌక‌లు హ్యాండిల్ చేసే సామర్థ్యం విశాఖ పోర్టు సంత‌రించుకోవడం వ‌ల్ల ఇది కంటైన‌ర్ ట్రాన్సిప్మెంట్ హ‌బ్​గా మారేందుకు వీలుచిక్కింది.

ఇదీ చదవండి:

తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప

Last Updated : Nov 30, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.