ETV Bharat / city

ఏయూలో కరోనా కలవరం...జిల్లా యంత్రాంగం అప్రమత్తం - corona cases in Andhra University

క‌రోనా క‌ల‌క‌లం ఆంధ్ర విశ్వవిద్యాల‌యాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో.. 66 మందికిపైగా కొవిడ్‌ పాజిటివ్‌గా రావటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్వయంగా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌...కొవిడ్‌ రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారంద‌రినీ క్వారంటైన్‌లో ఉంచామని మిగిలిన విద్యార్థులకు కూడా కొవిడ్‌ టెస్టులు చేయిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

Andhra University
విశాఖ ఏయూలో కరోనా కలవరం
author img

By

Published : Mar 27, 2021, 7:22 PM IST

విశాఖ ఏయూలో కరోనా కలవరం

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాల‌యం ఇంజ‌నీరింగ్ వ‌స‌తి గృహాల్లో 66కిపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌డంతో జిల్లా యంత్రాంగ పూర్తిస్దాయిలో దృష్టి పెట్టింది. జిల్లా కలెక్టర్ విన‌య్ చంద్, ప్రాంతీయ కొవిడ్ నోడ‌ల్ అధికారి డాక్టర్ పీవీ సుధాక‌ర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయ‌ణ స‌హా అధికారుల బృందం ఈ హాస్టళ్లను సంద‌ర్శించింది. మొత్తం విద్యార్దులంద‌రికీ కొవిడ్ ప‌రీక్షలు నిర్వహిస్తున్నామ‌ని జిల్లా క‌లెక్టర్ విన‌య్ చంద్ ప్రక‌టించారు. ఇప్పటివ‌ర‌కు బ‌య‌ట‌ప‌డిన పాజిటివ్ కేసుల్లో ఎవ్వరికి తీవ్ర ల‌క్షణాలు లేవ‌ని, కొంత‌మందికి మాత్రం కొద్దిపాటి ల‌క్షణాలు మాత్రమే ఉన్నాయ‌న్నారు. వారంద‌రిని ప్రత్యేకంగా ఉంచి అవ‌స‌ర‌మైన చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. వ‌స‌తి గృహాల్లో ఉండ‌డం వ‌ల్ల వేగంగా ఒకరి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందింద‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని, ఇంజ‌నీరింగ్ బాయ్స్ హాస్టల్​లోనే హోం క్వారంటైన్ ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌కు కూడా స‌మాచారం ఇచ్చామ‌ని, ఎవ్వరూ ఎటువంటి అందోళ‌న అవ‌స‌రం లేదని స్పష్టం చేశారు. ఇదంతా కంటైన్​మెంట్ జోన్​గా ప‌రిగ‌ణించి దానికి అనుగుణంగా చ‌ర్యలు చేపట్టిన‌ట్టు, శానిటైజేష‌న్ ప్రక్రియ జీవీఎంసీ మొద‌లు పెట్టిందని చెప్పారు.

పరీక్షలన్నీ వాయిదా..తరగతులన్నీ ఆన్​లైన్

విశ్వవిద్యాల‌యంలోని ఉత్తర క్యాంపస్ అయిన‌ ఇంజ‌నీరింగ్ కాంప‌స్​లో ఈ కేసులు వెలుగు చూడ‌డం ఆ ప్రభావం ద‌క్షిణ క్యాంప‌స్​పై కూడా ప‌డింది. ఇక్కడ ఉన్న ఆర్ట్స్, సైన్స్, లా, ప‌రిశోధ‌క విద్యార్ధులు హాస్టల్స్ అన్నింటిని ఆదివారం రాత్రి నుంచి నిర‌వ‌ధికంగా మూసివేస్తున్నట్టు విశ్వవిద్యాల‌యం విద్యార్ధుల‌కు నోటీసులు జారీ చేసింది. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున ఇంజ‌నీరింగ్ కాంప‌స్​లో వెలుగు చూసినందున ఈ అత్యవ‌స‌ర నిర్ణయం తీసుకున్నామ‌ని స్పష్టం చేసింది.. విద్యార్ధులు హాస్టళ్లను ఖాళీ చేసి త‌మ స్వస్దలాల‌కు వెళ్లాల్సిందిగా కోరింది. జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌న్నింటినీ వాయిదా వేసిన విశ్వవిద్యాల‌యం.. ఇక‌పై అన్నీ అన్​లైన్ త‌ర‌గ‌తులే జ‌రుగుతాయ‌ని వివ‌రించింది. విద్యార్ధులంద‌రికీ క‌రోనా ప‌రీక్షల‌ను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగంతో సంప్రదించి పూర్తిస్ధాయిలో ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించింది.

ఇదీ చదవండి:

శబ్ద కాలుష్యం..వినికిడి శక్తికి విఘాతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.