విశాఖ మన్యంలో దారాలమ్మ ఘాట్ రోడ్డులో జీపు అదుపుతప్పి (road accident at dharalamma ghat road in vishakapatnam) బోల్తాపడింది. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
జి.మాడుగుల మండలం బౌడ గ్రామాంలోని ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. గూడెం కొత్తవీధి మండలం ధారకొండ దారాలమ్మ తల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో.. దారాలమ్మ ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద బ్రేకులు ఫెయిలై జీపు అదుపుతప్పి బోల్తాపడింది.
పాదయాత్ర చేస్తున్న గిరిజన జేఏసీ సభ్యులు వారిని గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డవారిని అక్కడి నుంచి చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
HOUSE DESTROYED WITH RAINS IN RAILWAY KODURU : వరద ఉద్ధృతికి కూలిన భవనం.. లైవ్ వీడియో