రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్. నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం ఏపీ రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి.. నాలుగు రాజ్యసభ స్థానాలకు నలుగురు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏపీలో నాలుగు స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా వైకాపా నుంచి నలుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ్టితో నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగియడంతో నలుగురు సభ్యులు ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న అనంతరం ఎంపీలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి