వైకాపా ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేశారు. తెదేపా గుర్తింపు రద్దు చేయాలని సీఈసీని కోరినట్లు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. తెదేపా నేతలు పట్టాభి, లోకేశ్ చేసిన పరుష వ్యాఖ్యలను ఈసీకి వివరించామన్నారు. శాసనమండలిలో ఖాళీలను భర్తీ చేయాలని ఈసీని కోరామని.. తమ విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించిందని విజయసాయి వెల్లడించారు.
తెదేపా గుర్తింపు రద్దు చేయాలని సీఈసీని కోరాం. పట్టాభి, లోకేశ్ పరుష వ్యాఖ్యలనూ ఈసీకి వివరించాం. మండలిలో ఖాళీలను భర్తీ చేయాలని ఈసీని కోరాం. మా విజ్ఞప్తులపై ఈసీ సానుకూలంగా స్పందించింది. -విజయసాయి, వైకాపా రాజ్యసభ సభ్యుడు
ఇదీ చదవండి